Tamil Bible | Sajeeva Vahini
Home
Tamil Bible - பரிசுத்த வேதாகமம்
All Books
Old Testament
Genesis - ஆதியாகமம்
Exodus - யாத்திராகமம்
Leviticus - லேவியராகமம்
Numbers - எண்ணாகமம்
Deuteronomy - உபாகமம்
Joshua - யோசுவா
Judges - நியாயாதிபதிகள்
Ruth - ரூத்
1 Samuel - 1 சாமுவேல்
2 Samuel - 2 சாமுவேல்
1 Kings - 1 இராஜாக்கள்
2 Kings - 2 இராஜாக்கள்
1 Chronicles - 1 நாளாகமம்
2 Chronicles - 2 நாளாகமம்
Ezra - எஸ்றா
Nehemiah - நெகேமியா
Esther - எஸ்தர்
Job - யோபு
Psalms - சங்கீதம்
Proverbs - நீதிமொழிகள்
Ecclesiastes - பிரசங்கி
Song of Songs - உன்னதப்பாட்டு
Isaiah - ஏசாயா
Jeremiah - எரேமியா
Lamentations - புலம்பல்
Ezekiel - எசேக்கியேல்
Daniel - தானியேல்
Hosea - ஓசியா
Joel - யோவேல்
Amos - ஆமோஸ்
Obadiah - ஒபதியா
Jonah - யோனா
Micah - மீகா
Nahum - நாகூம்
Habakkuk - ஆபகூக்
Zephaniah - செப்பனியா
Haggai - ஆகாய்
Zechariah - சகரியா
Malachi - மல்கியா
New Testament
Matthew - மத்தேயு
Mark - மாற்கு
Luke - லூக்கா
John - யோவான்
Acts - அப்போஸ்தலருடைய நடபடிகள்
Romans - ரோமர்
1 Corinthians - 1 கொரிந்தியர்
2 Corinthians - 2 கொரிந்தியர்
Galatians - கலாத்தியர்
Ephesians - எபேசியர்
Philippians - பிலிப்பியர்
Colossians - கொலோசெயர்
1 Thessalonians - 1 தெசலோனிக்கேயர்
2 Thessalonians - 2 தெசலோனிக்கேயர்
1 Timothy - 1 தீமோத்தேயு
2 Timothy - 2 தீமோத்தேயு
Titus - தீத்து
Philemon - பிலேமோன்
Hebrews - எபிரேயர்
James - யாக்கோபு
1 Peter - 1 பேதுரு
2 Peter - 2 பேதுரு
1 John - 1 யோவான்
2 John - 2 யோவான்
3 John - 3 யோவான்
Jude - யூதா
Revelation - வெளிப்படுத்தின விசேஷம்
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
more
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Podcast
Digital Library
Free Wallpapers
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
1
Tuesday, October 2024
Change Date :
Previous
|
Next
Organized from Old Testament, New Testament, Psalms & Proverbs. Read and Complete Hindi Bible in One Year!
Jeremiah 4
10. అప్పుడు నేనిట్లంటిని కటకటా, యెహోవా ప్రభువా, ఖడ్గము హత్యచేయుచుండగా నీవు మీకు క్షేమము కలుగునని చెప్పి నిశ్చయముగా ఈ ప్రజలను యెరూషలేమును బహుగా మోసపుచ్చితివి.
11. ఆ కాలమున ఈ జనులకును యెరూషలేమునకును ఈలాగు చెప్పబడును అరణ్యమందు చెట్లులేని మెట్టలమీదనుండి వడగాలి నా జనుల కుమార్తెతట్టు విసరుచున్నది; అది తూర్పార పట్టుటకైనను శుద్ధి చేయుటకైనను తగినది కాదు.
12. అంతకంటె మిక్కుటమైన గాలి నామీద కొట్టుచున్నది. ఇప్పుడు వారిమీదికి రావలసిన తీర్పులు సెలవిత్తును అని యెహోవా చెప్పుచున్నాడు.
13. మేఘములు కమ్మునట్లు ఆయన వచ్చుచున్నాడు, ఆయన రథములు సుడిగాలివలె నున్నవి, ఆయన గుఱ్ఱములు గద్దలకంటె వేగముగలవి, అయ్యో, మనము దోపుడు సొమ్మయితివిు.
14. యెరూషలేమా, నీవు రక్షింపబడునట్లు నీ హృదయములోనుండి చెడుతనము కడిగివేసికొనుము, ఎన్నాళ్లవరకు నీ దుష్టాభి ప్రాయములు నీకు కలిగియుండును?
15. దాను ప్రదేశమున నొకడు ప్రకటన చేయుచున్నాడు, కీడు వచ్చుచున్నదని ఎఫ్రాయిము కొండలయందొకడు చాటించుచున్నాడు,
16. ముట్టడి వేయువారు దూరదేశమునుండి వచ్చి యూదా పట్టణములను పట్టుకొందుమని బిగ్గరగా అరచుచున్నారని యెరూషలేమునుగూర్చి ప్రకటనచేయుడి, జనములకు తెలియజేయుడి.
17. ఆమె నామీద తిరుగుబాటు చేసెను గనుక వారు చేనికాపరులవలె దానిచుట్టు ముట్టడివేతురు; ఇదే యెహోవా వాక్కు.
18. నీ ప్రవర్తనయు నీ క్రియలును వీటిని నీమీదికి రప్పించెను. నీ చెడుతనమే దీనికి కారణము, ఇది చేదుగానున్నది గదా, నీ హృదయము నంటుచున్నది గదా?
19. నా కడుపు, నా కడుపు, నా అంతరంగములో నా కెంతో వేదనగానున్నది; నా గుండె నరములు, నా గుండె కొట్టుకొనుచున్నది, తాళలేను; నా ప్రాణమా, బాకానాదము వినబడుచున్నది గదా, యుద్ధఘోష నీకు వినబడుచున్నది గదా?
20. కీడు వెంట కీడు వచ్చుచున్నది, దేశమంతయు దోచుకొనబడుచున్నది, నా గుడారములును హఠాత్తుగాను నిమిషములో నా డేరా తెరలును దోచుకొనబడియున్నవి.
21. నేను ఎన్నాళ్లు ధ్వజమును చూచుచుండవలెను బూరధ్వని నేనెన్నాళ్లు వినుచుండవలెను?
22. నా జనులు అవివేకులు వారు నన్నెరుగరు, వారు మూఢులైన పిల్లలు వారికి తెలివిలేదు, కీడుచేయుటకు వారికి తెలియును గాని మేలు చేయుటకు వారికి బుద్ది చాలదు.
23. నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; ఆకాశముతట్టు చూడగా అచ్చట వెలుగులేకపోయెను.
24. పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి కొండలన్నియు కదులుచున్నవి.
25. నేను చూడగా నరుడొకడును లేకపోయెను, ఆకాశపక్షులన్నియు ఎగిరిపోయియుండెను.
26. నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి యెడారి ఆయెను, అందులోని పట్టణములన్నియు యెహోవా కోపాగ్నికి నిలువలేక ఆయన యెదుట నుండకుండ పడగొట్టబడియుండెను.
27. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఈదేశమంతయు పాడగును గాని నిశ్శేషముగా దాని నాశనము చేయను.
28. దానినిబట్టి భూమి దుఃఖించుచున్నది, పైన ఆకాశము కారు కమ్మియున్నది, అయితే నేను దానిని నిర్ణయించినప్పుడు మాట ఇచ్చితిని, నేను పశ్చాత్తాప పడుటలేదు రద్దుచేయుటలేదు.
29. రౌతులును విలుకాండ్రును చేయు ధ్వని విని పట్టణస్థులందరు పారిపోవుచున్నారు, తుప్పలలో దూరుచున్నారు, మెట్టలకు ఎక్కుచున్నారు, ప్రతి పట్టణము నిర్జనమాయెను వాటిలొ నివాసులెవరును లేరు,
30. దోచుకొన బడినదానా, నీవేమి చేయుదువు? రక్త వర్ణవస్త్రములు కట్టుకొని సువర్ణ భూషణములు ధరించి కాటుకచేత నీ కన్నులు పెద్దవిగా చేసి కొనుచున్నావే; నిన్ను నీవు అలంకరించుకొనుట వ్యర్థమే; నీ విటకాండ్రు నిన్ను తృణీకరించుదురు, వారే నీ ప్రాణము తీయజూచుచున్నారు.
31. ప్రసవవేదనపడు స్త్రీ కేకలువేయునట్లు, తొలికానుపు కనుచు వేదనపడు స్త్రీ కేకలువేయునట్లు సీయోనుకుమార్తె అయ్యో, నాకు శ్రమ, నరహంతకులపాలై నేను మూర్చిల్లుచున్నాను అని యెగరోజుచు చేతులార్చుచు కేకలువేయుట నాకు వినబడుచున్నది.
Jeremiah 5
1. యెరూషలేము వీధులలో అటు ఇటు పరుగెత్తుచు చూచి తెలిసికొనుడి; దాని రాజవీధులలో విచారణ చేయుడి; న్యాయము జరిగించుచు నమ్మకముగానుండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడినయెడల నేను దాని క్షమించుదును.
2. యెహోవా జీవముతోడు అను మాట పలికినను వారు మోసమునకై ప్రమాణము చేయుదురు.
3. యెహోవా, యథార్థతమీదనే గదా నీవు దృష్టి యుంచుచున్నావు? నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలుగలేదు; వారిని క్షీణింపజేసియున్నావు గాని వారు శిక్షకు లోబడనొల్లకున్నారు. రాతికంటె తమ ముఖములను కఠినముగా చేసికొనియున్నారు, మళ్లుటకు సమ్మతింపరు.
4. నేనిట్లనుకొంటిని వీరు ఎన్నికలేనివారై యుండి యెహోవా మార్గమును, తమ దేవుని న్యాయవిధిని ఎరుగక బుద్ధిహీనులై యున్నారు.
7. నీ పిల్లలు నన్ను విడిచి దైవము కానివాటి తోడని ప్రమాణము చేయుదురు; నేను వారిని తృప్తిగ పోషించినను వారు వ్యభిచారము చేయుచు వేశ్యల ఇండ్లలో గుంపులు కూడుదురు; నేనెట్లు నిన్ను క్షమించుదును?
9. అట్టి కార్యములనుబట్టి నేను దండింపకుందునా? అట్టి జనముమీద నా కోపము తీర్చుకొనకుందునా? ఇదే యెహోవా వాక్కు.
10. దాని ప్రాకారము లెక్కి నాశనముచేయుడి, అయినను నిశ్శేషముగా నాశనము చేయకుడి, దాని శాఖలను కొట్టి వేయుడి. అవి యెహోవావి కావు.
11. ఇశ్రాయేలు వంశస్థులును యూదా వంశస్థులును బహుగా విశ్వాసఘాతకము చేసియున్నారు; ఇదే యెహోవా వాక్కు.
5. ఘనులైనవారియొద్దకు పోయెదను వారితో మాటలాడెదను, వారు యెహోవా మార్గమును, తమ దేవుని న్యాయవిధిని ఎరిగినవారై యుందురుగదా అని నేననుకొంటిని. అయితే ఒకడును తప్పకుండ వారు కాడిని విరిచినవారుగాను కట్లను తెంపు కొనినవారుగాను ఉన్నారు.
6. వారు తిరుగుబాటుచేసి బహుగా విశ్వాసఘాతకులైరి గనుక అరణ్యమునుండి వచ్చిన సింహము వారిని చంపును, అడవి తోడేలు వారిని నాశనము చేయును, చిరుతపులి వారి పట్టణములయొద్ద పొంచియుండును, వాటిలోనుండి బయలుదేరు ప్రతివాడు చీల్చబడును.
8. బాగుగా బలిసిన గుఱ్ఱములవలె ప్రతివాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్యవెంబడి సకిలించును
12. వారుపలుకువాడు యెహోవా కాడనియు ఆయన లేడనియు, కీడు మనకు రాదనియు, ఖడ్గమునైనను కరవునైనను చూడమనియు,
13. ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురనియు, ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేడనియు, తాము చెప్పినట్లు తమకు కలుగుననియు చెప్పుదురు.
14. కావున సైన్యములకధిపతియు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసెదను; ఇదే యెహోవా వాక్కు.
15. ఇశ్రాయేలు కుటుంబమువారలారా, ఆలకించుడి, దూరముననుండి మీ మీదికి ఒక జనమును రప్పించెదను, అది బలమైన జనము పురాతనమైన జనము; దాని భాష నీకు రానిది, ఆ జనులు పలుకుమాటలు నీకు బోధపడవు.
16. వారి అమ్ముల పొది తెరచిన సమాధి, వారందరు బలాఢ్యులు,
17. వారు నీ పంటను నీ ఆహారమును నాశనము చేయుదురు, నీ కుమారులను నీ కుమార్తెలను నాశనము చేయుదురు, నీ గొఱ్ఱెలను నీ పశువులను నాశనము చేయుదురు, నీ ద్రాక్షచెట్ల ఫలమును నీ అంజూరపుచెట్ల ఫలమును నాశనము చేయుదురు, నీకు ఆశ్రయముగానున్న ప్రాకారములుగల పట్టణములను వారు కత్తిచేత పాడుచేయుదురు.
18. అయినను ఆ దినములలో నేను మిమ్మును శేషములేకుండ నశింపజేయను; ఇదే యెహోవా వాక్కు.
19. మన దేవుడైన యెహోవా దేనినిబట్టి ఇవన్నియు మాకు చేసెనని వారడుగగా నీవు వారితో ఈలాగనుము మీరు నన్ను విసర్జించి మీ స్వదేశములో అన్యదేవతలను కొలిచినందుకు, మీదికాని దేశములో మీరు అన్యులను కొలిచెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
20. యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియజేయుడి, యూదా వంశస్థులకు ఈ సమాచారము చాటించుడి
21. కన్నులుండియు చూడకయు చెవులుండియు వినకయు నున్న వివేకములేని మూఢులారా, ఈ మాట వినుడి.
22. సముద్రము దాటలేకుండునట్లును, దాని తరంగములెంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయముచేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వణకరా? ఇదే యెహోవా వాక్కు.
23. ఈ జనులు తిరుగు బాటును ద్రోహమునుచేయు మనస్సుగల వారు, వారు తిరుగుబాటుచేయుచు తొలగి పోవుచున్నారు.
24. వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగియుందము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని దాని కాలమున కురిపించు వాడు గదా; నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకొనరు.
25. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము.
26. నా జనులలో దుష్టులున్నారు, పక్షుల వేటకాండ్రు పొంచియుండునట్లు వారు పొంచియుందురు వారు బోనులు పెట్టుదురు, మనుష్యులను పట్టుకొందురు.
27. పంజరము పిట్టలతో నిండియుండునట్లు వారి యిండ్లు కపటముతో నిండియున్నవి, దానిచేతనే వారు గొప్పవారును ఐశ్వర్య వంతులును అగుదురు.
28. వారు క్రొవ్వి బలిసియున్నారు, అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు, తండ్రిలేనివారు గెలువకుండునట్లు వారి వ్యాజ్యెమును అన్యాయముగా తీర్చుదురు, దీనుల వ్యాజ్యెమును తీర్పునకు రానియ్యరు.
29. అట్టి వాటిని చూచి నేను శిక్షింపక యుందునా? అట్టి జనులకు నేను ప్రతి దండన చేయకుందునా? ఇదే యెహోవా వాక్కు.
30. ఘోరమైన భయంకరకార్యము దేశములో జరుగుచున్నది.
31. ప్రవక్తలు అబద్ధప్రవచనములు పలికెదరు, యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు, ఆలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము; దాని ఫలము నొందునప్పుడు మీరేమి చేయుదురు?
Philippians 3
1. మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదేసంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము.
2. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. దుష్టులైన పని వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదన నాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి.
3. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసికొనక దేవునియొక్క ఆత్మవలన ఆరాధించుచు, క్రీస్తుయేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము.
4. కావలయునంటే నేను శరీరమును ఆస్పదము చేసికొనవచ్చును; మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసికొనదలచినయెడల నేను మరి యెక్కువగా చేసికొనవచ్చును.
5. ఎనిమిదవ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపువాడనై, బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్రవిషయము పరిసయ్యుడనై,
6. ఆసక్తివిషయము సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రమువలని నీతివిషయము అనింద్యుడనై యుంటిని.
7. అయినను ఏవేవి నాకు లాభకరములై యుండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని.
8. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అతిశ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను.
9. క్రీస్తును సంపాదించుకొని, ధర్మశాస్త్ర మూలమైన నా నీతినిగాక, క్రీస్తునందలి విశ్వాసమువలననైన నీతి, అనగా విశ్వాసమునుబట్టి దేవుడు అనుగ్రహించు నీతిగల వాడనై ఆయనయందు అగపడు నిమిత్తమును,
10. ఏ విధముచేతనైనను మృతులలోనుండి నాకు పునరుత్థానము కలుగవలెనని, ఆయన మరణవిషయములో సమానానుభవముగలవాడనై, ఆయనను ఆయన పునరుత్థానబలమును ఎరుగు నిమిత్తమును,
11. ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును, సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను.
12. ఇదివరకే నేను గెలిచితినని యైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని యైనను నేను అనుకొనుటలేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసుచేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తు చున్నాను.
13. సహోదరులారా, నేనిదివరకే పట్టుకొని యున్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను; వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు
14. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను.
15. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగియుందము. అప్పుడు దేనిగూర్చియైనను మీకు వేరు తాత్పర్యము కలిగియున్నయెడల, అదియు దేవుడు మీకు బయలు పరచును.
16. అయినను ఇప్పటివరకు మనకు లభించిన దానినిబట్టియే క్రమముగా నడుచుకొందము.
17. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి; మేము మీకు మాదిరియైయున్న ప్రకారము నడుచుకొను వారిని గురిపెట్టి చూడుడి.
18. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు; వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి యిప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను.
19. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు; వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు, భూసంబంధమైనవాటి యందే మనస్సు నుంచుచున్నారు.
20. మన పౌరస్థితి పరలోకమునందున్నది; అక్కడనుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము.
21. సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తినిబట్టి ఆయన మన దీనశరీరమును తన మహిమగల శరీరమునకు సమ రూపము గలదానిగా మార్చును.
Philippians 4
1. కావున నేనపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునైయున్న నా ప్రియులారా, యిట్లు ప్రభువునందు స్థిరులై యుండుడి.
2. ప్రభువునందు ఏకమనస్సుగలవారై యుండుడని యువొదియను, సుంటుకేను బతిమాలుకొనుచున్నాను.
3. అవును, నిజమైన సహకారీ ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా యితర సహకారులతోను సువార్తపనిలో నాతోకూడ ప్రయాసపడినవారు గనుక వారికి సహాయము చేయుమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడియున్నవి
4. ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పు దును ఆనందించుడి.
5. మీ సహనమును సకల జనులకు తెలియబడనియ్యుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు.
6. దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.
7. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును.
8. మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్య మైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యాన ముంచుకొనుడి.
9. మరియు మీరు నావలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో, అట్టివాటిని చేయుడి; అప్పుడు సమాధాన కర్తయగు దేవుడు మీకు తోడైయుండును.
10. నన్నుగూర్చి మీరిన్నాళ్లకు మరల యోచన చేయసాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయములో మీరు యోచనచేసియుంటిరి గాని తగిన సమయము దొరకకపోయెను.
11. నాకు కొదువ కలిగినందున నేనీలాగు చెప్పుటలేదు; నేనేస్థితిలో ఉన్నను ఆస్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొని యున్నాను.
13. నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.
14. అయినను నా శ్రమలో మీరు పాలుపుచ్చుకొనినది మంచిపని.
12. దీనస్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును; ప్రతివిషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండియుండుటకును ఆకలిగొనియుండుటకును, సమృద్ధికలిగియుండుటకును లేమిలో ఉండుటకును నేర్చు కొనియున్నాను.
15. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింప నారంభించి మాసిదోనియలోనుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొను విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపువారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియును.
16. ఏలయనగా థెస్సలొనీకలో కూడ మీరు మాటిమాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి.
17. నేను యీవిని అపేక్షించి యీలాగు చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తారఫలము రావలెనని అపేక్షించి చెప్పుచున్నాను.
18. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగియున్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితువలన పుచ్చుకొని యేమియు తక్కువలేక యున్నాను; అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై యున్నవి.
19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును.
20. మన తండ్రియైన దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్.
21. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తుయేసునందు వందనములు చెప్పుడి.
22. నాతోకూడ ఉన్న సహోదరులందరు మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరును ముఖ్యముగా కైసరు ఇంటివారిలో ఉన్న పరిశుద్ధులును మీకు వందనములు చెప్పుచున్నారు.
23. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక.
Psalms 116
1. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి యున్నాడు. కాగా నేనాయనను ప్రేమించుచున్నాను.
2. ఆయన నాకు చెవియొగ్గెను కావున నా జీవితకాలమంతయు నేనాయనకు మొఱ్ఱ పెట్టుదును
3. మరణబంధములు నన్ను చుట్టుకొని యుండెను పాతాళపు వేదనలు నన్ను పట్టుకొనియుండెను శ్రమయు దుఃఖమును నాకు కలిగెను.
4. అప్పుడు యెహోవా, దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమునుబట్టి నేను మొఱ్ఱపెట్టితిని.
5. యెహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యతగలవాడు.
6. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను క్రుంగియుండగా ఆయన నన్ను రక్షించెను.
7. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింప జేసియున్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము.
8. మరణమునుండి నా ప్రాణమును కన్నీళ్లు విడువకుండ నా కన్నులను జారిపడకుండ నాపాదములను నీవు తప్పించియున్నావు.
9. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును.
10. నేను ఆలాగు మాటలాడి నమ్మిక యుంచితిని. నేను మిగుల బాధపడినవాడను.
11. నేను తొందరపడినవాడనై ఏ మనుష్యుడును నమ్మదగినవాడు కాడనుకొంటిని.