Tamil Bible | Sajeeva Vahini
Home
Tamil Bible - பரிசுத்த வேதாகமம்
All Books
Old Testament
Genesis - ஆதியாகமம்
Exodus - யாத்திராகமம்
Leviticus - லேவியராகமம்
Numbers - எண்ணாகமம்
Deuteronomy - உபாகமம்
Joshua - யோசுவா
Judges - நியாயாதிபதிகள்
Ruth - ரூத்
1 Samuel - 1 சாமுவேல்
2 Samuel - 2 சாமுவேல்
1 Kings - 1 இராஜாக்கள்
2 Kings - 2 இராஜாக்கள்
1 Chronicles - 1 நாளாகமம்
2 Chronicles - 2 நாளாகமம்
Ezra - எஸ்றா
Nehemiah - நெகேமியா
Esther - எஸ்தர்
Job - யோபு
Psalms - சங்கீதம்
Proverbs - நீதிமொழிகள்
Ecclesiastes - பிரசங்கி
Song of Songs - உன்னதப்பாட்டு
Isaiah - ஏசாயா
Jeremiah - எரேமியா
Lamentations - புலம்பல்
Ezekiel - எசேக்கியேல்
Daniel - தானியேல்
Hosea - ஓசியா
Joel - யோவேல்
Amos - ஆமோஸ்
Obadiah - ஒபதியா
Jonah - யோனா
Micah - மீகா
Nahum - நாகூம்
Habakkuk - ஆபகூக்
Zephaniah - செப்பனியா
Haggai - ஆகாய்
Zechariah - சகரியா
Malachi - மல்கியா
New Testament
Matthew - மத்தேயு
Mark - மாற்கு
Luke - லூக்கா
John - யோவான்
Acts - அப்போஸ்தலருடைய நடபடிகள்
Romans - ரோமர்
1 Corinthians - 1 கொரிந்தியர்
2 Corinthians - 2 கொரிந்தியர்
Galatians - கலாத்தியர்
Ephesians - எபேசியர்
Philippians - பிலிப்பியர்
Colossians - கொலோசெயர்
1 Thessalonians - 1 தெசலோனிக்கேயர்
2 Thessalonians - 2 தெசலோனிக்கேயர்
1 Timothy - 1 தீமோத்தேயு
2 Timothy - 2 தீமோத்தேயு
Titus - தீத்து
Philemon - பிலேமோன்
Hebrews - எபிரேயர்
James - யாக்கோபு
1 Peter - 1 பேதுரு
2 Peter - 2 பேதுரு
1 John - 1 யோவான்
2 John - 2 யோவான்
3 John - 3 யோவான்
Jude - யூதா
Revelation - வெளிப்படுத்தின விசேஷம்
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
more
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Podcast
Digital Library
Free Wallpapers
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
22
Wednesday, January 2025
Change Date :
Previous
|
Next
Organized from Old Testament, New Testament, Psalms & Proverbs. Read and Complete Hindi Bible in One Year!
Genesis 43
1. ఆ దేశమందు కరవు భారముగా ఉండెను గనుక
2. వారు ఐగుప్తునుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తరువాత వారి తండ్రి - మీరు మరల వెళ్లి మన కొరకు కొంచెము ఆహారము కొనుడని వారితో అనగా
3. యూదా అతని చూచి - ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పెను.
4. కాబట్టి నీవు మాతమ్ముని మాతో కూడ పంపిన యెడల మేము వెళ్లి నీకొరకు ఆహారము కొందుము.
5. నీవు వానిని పంపనొల్లనియెడల మేము వెళ్లము; ఆ మనుష్యుడు - మీ తమ్ముడు మీతో లేనియెడల మీరు నా ముఖము చూడకూడదని మాతో చెప్పెననెను.
6. అందుకు ఇశ్రాయేలు మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుష్యునితో చెప్పి నాకు ఇంత శ్రమ కలుగజేయనేల అనగా
7. వారు ఆ మనుష్యుడు - మీ తండ్రి యింక సజీవుడైయున్నాడా? మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మును గూర్చియు మా బంధువులను గూర్చియు ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టు అతనికి వాస్తవము తెలియచెప్పితివిు - మీ సహోదరుని తీసికొని రండని అతడు చెప్పునని మాకెట్లు తెలియుననిరి.
8. యూదా తన తండ్రియైన ఇశ్రాయేలును చూచి ఆ చిన్న వానిని నాతో కూడ పంపుము, మేము లేచి వెళ్లుదుము, అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలును చావక బ్రదుకుదుము;
9. నేను అతనిగూర్చి పూటపడుదును, నీవు అతనిగూర్చి నన్ను అడుగవలెను; నేను అతని తిరిగి నీయొద్దకు తీసికొనివచ్చి నీయెదుట నిలువబెట్టని యెడల ఆ నింద నా మీద ఎల్లప్పుడును ఉండును.
10. మాకు తడవు కాకపోయిన యెడల ఈపాటికి రెండవ మారు తిరిగి వచ్చి యుందుమని చెప్పగా
11. వారి తండ్రియైన ఇశ్రాయేలు వారితొ అట్లయిన మీరీలాగు చేయుడి; ఈ దేశమందు ప్రసిద్ధములైనవి, అనగా కొంచెము మస్తకి కొంచెము తేనె సుగంధ ద్రవ్యములు బోళము పిస్తాచకాయలు బాదముకాయలు మీ గోనెలలో వేసికొని ఆ మనుష్యునికి కానుకగా తీసికొని పోవుడి.
12. రెట్టింపు రూకలు మీరు తీసికొనుడి, మీ గోనెల మూతిలో ఉంచబడి తిరిగివచ్చిన రూకలు కూడ చేత పట్టు కొనిపోయి మరల ఇచ్చివేయుడి; ఒకవేళ అది పొరబాటై యుండును;
13. మీ తమ్ముని తీసికొని లేచి ఆ మనుష్యుని యొద్దకు తిరిగి వెళ్లుడి.
14. ఆ మనుష్యుడు మీ యితర సహోదరుని బెన్యామీనును మీ కప్పగించునట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుష్యుని యెదుట మిమ్మును కరుణించును గాక. నేను పుత్రహీనుడనై యుండవలసిన యెడల పుత్రహీనుడనగుదునని వారితో చెప్పెను.
15. ఆ మనుష్యులు ఆ కానుకను తీసికొని, చేతులలో రెట్టింపు రూకలను తమవెంట బెన్యామీనును తీసికొని లేచి ఐగుప్తునకు వెళ్లి యోసేపు యెదుట నిలిచిరి.
16. యోసేపు వారితోనున్న బెన్యామీనును చూచి తన గృహనిర్వాహకునితో - ఈ మనుష్యులను ఇంటికి తీసికొనిపోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము; మధ్యాహ్నమందు ఈ మనుష్యులు నాతో భోజనము చేయుదురని చెప్పెను.
17. యోసేపు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుష్యులను యోసేపు ఇంటికి తీసికొనిపోయెను.
18. ఆ మనుష్యులు యోసేపు ఇంటికి రప్పింపబడినందున వారు భయపడిమొదట మన గోనెలలో తిరిగి పెట్టబడిన రూకల నిమిత్తము అతడు మన మీదికి అకస్మాత్తుగా వచ్చి మీదపడి మనలను దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసికొనుటకు లోపలికి తెప్పించెననుకొనిరి.
19. వారు యోసేపు గృహనిర్వాహకుని యొద్దకు వచ్చి యింటి ద్వారమున అతనితో మాటలాడి
20. అయ్యా ఒక మనవి; మొదట మేము ఆహారము కొనుటకే వచ్చితివిు.
21. అయితే మేము దిగిన చోటికి వచ్చి మా గోనెలను విప్పినప్పుడు, ఇదిగో మా మా రూకల తూనికెకు సరిగా ఎవరి రూకలు వారి గోనెమూతిలో నుండెను. అవి చేతపట్టుకొని వచ్చితివిు.
22. ఆహారము కొనుటకు మరి రూకలను తీసికొని వచ్చితివిు; మా రూకలను మా గోనెలలో నెవరు వేసిరో మాకు తెలియదని చెప్పిరి.
23. అందుకతడు మీకు క్షేమమగును గాక భయపడకుడి; మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చెను. మీ రూకలు నాకు ముట్టినవని చెప్పి షిమ్యోనును వారియొద్దకు తీసికొని వచ్చెను.
24. ఆ మనుష్యుడు వారిని యోసేపు ఇంటికి తీసికొని వచ్చి వారికి నీళ్లియ్యగా వారు కాళ్లు కడుగుకొనిరి. మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించెను.
25. అక్కడ తాము భోజనము చేయవలెనని వినిరి గనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చు వేళకు తమ కానుకను సిద్ధముచేసిరి.
26. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులలోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి, అతనికి నేలను సాగిలపడిరి.
27. అప్పుడు మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా? అతడు ఇంక బ్రతికి యున్నాడా? అని వారి క్షేమసమాచారము అడిగినందుకు వారు
28. నీ దాసుడైన మా తండ్రి ఇంక బ్రదికియున్నాడు క్షేమముగానున్నాడని చెప్పి వంగి సాగిలపడిరి.
29. అప్పుడతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచి - మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా? అని అడిగి - నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించును గాక
30. అప్పుడు తన తమ్మునిమీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి యేడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్లి అక్కడ ఏడ్చెను.
31. అప్పుడు అతడు ముఖము కడుగుకొని వెలుపలికి వచ్చి తన్ను తాను అణచుకొని, భోజనము వడ్డించుడని చెప్పెను.
32. అతనికిని వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తీయులకును వేరు వేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనము చేయరు; అది ఐగుప్తీయులకు హేయము.
33. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని యెదుట తమ తమ యీడు చొప్పున కూర్చుండిరి గనుక ఆ మనుష్యులు ఒకనివైపు ఒకడు చూచి ఆశ్చర్యపడిరి.
34. మరియు అతడు తన యెదుటనుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతులకంటె అయిదంతలు గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి.
Genesis 44
15. అప్పుడు యోసేపు - మీరు చేసిన యీ పని యేమిటి? నావంటి మనుష్యుడు శకునము చూచి తెలిసికొనునని మీకు తెలియదా అని వారితో అనగా
16. యూదా యిట్లనెను - ఏలిన వారితో ఏమి చెప్పగలము? ఏమందుము? మేము నిర్దోషులమని యెట్లు కనుపరచగలము? దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను. ఇదిగో మేమును ఎవని యొద్ద ఆ గిన్నె దొరికెనో వాడును ఏలిన వారికి దాసుల మగుదుమనెను.
17. అందుకతడు అట్లు చేయుట నాకు దూరమవునుగాక; ఎవనిచేతిలో ఆ గిన్నె దొరికెనో వాడే నాకు దాసుడుగా నుండును; మీరు మీ తండ్రి యొద్దకు సమాధానముగా వెళ్లుడని చెప్పగా
18. యూదా అతని సమీపించి ఏలినవాడా ఒక మనవి; ఒక మాట యేలిన వారితో తమ దాసుని చెప్పుకొననిమ్ము; తమ కోపము తమ దాసునిమీద రవులుకొననీయకుము; తమరు ఫరో అంతవారుగదా
19. ఏలినవాడు మీకు తండ్రియైనను సహోదరుడైనను ఉన్నాడా అని తమ దాసులనడిగెను.
20. అందుకు మేము మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితనమున పుట్టిన యొక చిన్నవాడును ఉన్నారు; వాని సహోదరుడు చనిపోయెను, వాని తల్లికి వాడొక్కడే మిగిలియున్నాడు, వాని తండ్రి వానిని ప్రేమించుచున్నాడని చెప్పితిమి.
21. అప్పుడు తమరు నేనతని చూచుటకు అతని నా యొద్దకు తీసికొని రండని తమ దాసులతో చెప్పితిరి.
22. అందుకు మేము ఆ చిన్నవాడు తన తండ్రిని విడువలేడు. వాడు తన తండ్రిని విడిచినయెడల వాని తండ్రి చనిపోవునని యేలినవారితో చెప్పితివిు.
23. అందుకు తమరు మీ తమ్ముడు మీతో రానియెడల మీరు మరల నా ముఖము చూడకూడదని తమ దాసులతో చెప్పితిరి.
24. కాబట్టి నా తండ్రియైన తమ దాసుని యొద్దకు మేము వెళ్లి యేలినవారి మాటలను అతనికి తెలియచేసితివిు.
25. మా తండ్రి మీరు తిరిగి వెళ్లి మనకొరకు కొంచెము అహారము కొనుక్కొని రండని చెప్పినప్పుడు
26. మేము అక్కడికి వెళ్లలేము; మా తమ్ముడు మాతో కూడ ఉండిన యెడల వెళ్లుదుము; మా తమ్ముడు మాతో నుంటేనే గాని ఆ మనుష్యుని ముఖము చూడలేమని చెప్పితివిు.
27. అందుకు తమ దాసుడైన నా తండ్రి నా భార్య నాకిద్దరిని కనెనని మీరెరుగుదురు.
28. వారిలో ఒకడు నా యొద్దనుండి వెళ్లి పోయెను. అతడు నిశ్చయముగా దుష్ట మృగములచేత చీల్చబడెననుకొంటిని, అప్పటినుండి అతడు నాకు కనబడలేదు.
29. మీరు నా యెదుటనుండి ఇతని తీసికొనిపోయిన తరువాత ఇతనికి హాని సంభవించినయెడల నెరసిన వెండ్రుకలుగల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని మాతో చెప్పెను.
30. కావున తమ దాసుడైన నా తండ్రియొద్దకు నేను వెళ్లినప్పుడు ఈ చిన్నవాడు మాయొద్ద లేనియెడల
31. అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసికొని యున్నది గనుక ఈ చిన్నవాడు మాయొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోవును. అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెండ్రుకలుగల తమ దాసుడైన మాతండ్రిని మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదము.
32. తమ దాసుడనైన నేను ఈ చిన్న వానినిగూర్చి నా తండ్రికి పూటపడి నీ యొద్దకు నేనతని తీసికొని రానియెడల నా తండ్రి దృష్టియందు ఆ నింద నా మీద ఎల్లప్పుడు ఉండునని చెప్పితిని.
33. కాబట్టి తమ దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలినవారికి దాసునిగా నుండనిచ్చి యీ చిన్నవాని తన సహోదరులతో వెళ్లనిమ్ము.
34. ఈ చిన్నవాడు నాతోకూడ లేనియెడల నా తండ్రియొద్దకు నేనెట్లు వెళ్లగలను? వెళ్లినయెడల నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చునని చెప్పెను.
1. యోసేపు ఆ మనుష్యుల గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనెమూతిలో పెట్టుమనియు,
2. కనిష్ఠుని గోనె మూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమనియు, తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేసెను.
3. తెల్లవారినప్పుడు ఆ మనుష్యులు తమ గాడిదలతో కూడ పంపివేయబడిరి.
4. వారు ఆ పట్టణమునుండి బయలు దేరి యెంతో దూరము వెళ్లక మునుపు, యోసేపు తన గృహనిర్వాహకుని చూచి నీవు లేచి ఆ మనుష్యుల వెంటబడి వెళ్లి వారిని కలిసికొని మీరు మేలుకు కీడు చేయనేల?
5. దేనితో నా ప్రభువు పానము చేయునో దేనివలన అతడు శకునములు చూచునో అది యిదే కదా? మీరు దీని చేయుటవలన కాని పని చేసితిరని వారితో చెప్పుమనెను.
6. అతడు వారిని కలిసికొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు
7. వారు మా ప్రభువు ఇట్లు మాటలాడనేల? ఇట్టి పని చేయుట నీ దాసులకు దూరమవును గాక.
8. ఇదిగో మా గోనెలమూతులలో మాకు దొరికిన రూకలను కనాను దేశములోనుండి తిరిగి తీసికొనివచ్చితివిు; నీ ప్రభువు ఇంటిలోనుండి మేము వెండినైనను బంగారము నైనను ఎట్లు దొంగిలుదుము?
9. నీ దాసులలో ఎవరియొద్ద అది దొరుకునో వాడు చచ్చును గాక; మరియు మేము మా ప్రభువునకు దాసులముగా నుందుమని అతనితో అనిరి.
10. అందుకతడు మంచిది, మీరు చెప్పినట్టే కానీయుడి; ఎవరి యొద్ద అది దొరుకునో అతడే నాకు దాసుడగును, అయితే మీరు నిర్దోషులగుదురని చెప్పెను.
11. అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను క్రిందికి దించి దానిని విప్పెను.
12. అతడు పెద్దవాడు మొదలుకొని చిన్న వానివరకు వారిని సోదా చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికెను.
13. కావున వారు తమ బట్టలు చింపుకొని ప్రతివాడు తన గాడిదమీద గోనెలు ఎక్కించు కొని తిరిగి పట్టణమునకు వచ్చిరి.
14. అప్పుడు యూదాయును అతని సహోదరులును యోసేపు ఇంటికి వచ్చిరి. అతడింక అక్కడనే ఉండెను గనుక వారు అతని యెదుట నేలను సాగిలపడిరి.
Matthew 15
10. జనసమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి;
11. నోటపడునది మనుష్యుని అపవిత్ర పరచదు గాని నోటనుండి వచ్చున దియే మనుష్యుని అప విత్రపరచునని వారితో చెప్పెను.
12. అంతట ఆయన శిష్యులు వచ్చిపరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియునా అని ఆయనను అడుగగా
13. ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెల్లగింపబడును.
14. వారి జోలికి పోకుడి; వారు గ్రుడ్డివారైయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన యెడల వారిద్దరు గుంటలో పడుదురు గదా అనెను.
15. అందుకుపేతురు ఈ ఉపమానభావము మాకు తెలుపుమని ఆయనను అడుగగా
16. ఆయనమీరును ఇంతవరకు అవివేకులైయున్నారా?
17. నోటిలోనికి పోవున దంతయు కడుపులోపడి బహిర్భూమిలో విడువబడును గాని
18. నోటనుండి బయటికి వచ్చునవి హృదయములో నుండి వచ్చును; ఇవే మనుష్యుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా?
19. దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్య ములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును
20. ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుగు కొనక భోజనముచేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పెను.
21. యేసు అక్కడనుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్లగా,
22. ఇదిగో ఆ ప్రాంతములనుండి కనాను స్త్రీ యొకతె వచ్చిప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము; నా కుమార్తె దయ్యముపట్టి, బహు బాధపడుచున్నదని కేకలువేసెను.
23. అందుకాయన ఆమెతో ఒక్క మాటయైనను చెప్పలేదు. అప్పుడాయన శిష్యులు వచ్చిఈమె మన వెంబడి వచ్చి కేకలువేయు చున్నది గనుక ఈమెను పంపి వేయుమని ఆయనను వేడుకొనగా
24. ఆయనఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్ఱెలయొద్దకే గాని మరి ఎవరియొద్దకును నేను పంపబడ లేదనెను
25. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా, నాకు సహాయము చేయుమని అడిగెను.
26. అందుకాయనపిల్లల రొట్టెతీసికొని కుక్కపిల్లలకువేయుట యుక్తము కాదని చెప్పగా
27. ఆమెనిజమే ప్రభువా, కుక్కపిల్లలుకూడ తమ యజమానుల బల్లమీదనుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను.
28. అందుకు యేసు అమ్మా, నీ విశ్వాసము గొప్పది; నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను.
29. యేసు అక్కడనుండి వెళ్లి, గలిలయ సముద్రతీరమునకు వచ్చి, కొండెక్కి అక్కడ కూర్చుండగా
30. బహు జనసమూహములు ఆయనయొద్దకు కుంటివారు గ్రుడ్డివారు మూగవారు అంగహీనులు మొదలైన అనేకులను తీసికొనివచ్చి ఆయన పాదములయొద్ద పడవేసిరి; ఆయన వారిని స్వస్థపరచెను.
31. మూగవారు మాటలాడు టయును అంగహీనులు బాగుపడుటయును కుంటివారు నడుచుటయును గ్రుడ్డివారు చూచుటయును జనసమూ హము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమ పరచిరి.
32. అంతట యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడు దినములనుండి నాయొద్ద నున్నారు; వారికి తిన నేమియు లేదు గనుక వారిమీద కనికరపడుచున్నాను; వారు మార్గములో మూర్ఛపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా
33. ఆయన శిష్యులుఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్యప్రదేశములో మనకు ఎక్కడనుండి వచ్చునని ఆయనతో అనిరి.
34. యేసుమీయొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారి నడుగగా వారుఏడు రొట్టెలును కొన్ని చిన్న చేపలును ఉన్నవని చెప్పిరి.
35. అప్పుడాయన నేలమీద కూర్చుండుడని జనసమూహమునకు ఆజ్ఞాపించి
36. ఆ యేడు రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను, శిష్యులు జన సమూహమునకు వడ్డించిరి
37. వారందరు తిని తృప్తి పొందినమీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండ ఎత్తిరి.
38. స్త్రీలును పిల్లలును గాక తినినవారు నాలుగువేల మంది పురుషులు.
39. తరువాత ఆయన జనసమూహములను పంపివేసి, దోనెయెక్కి మగదాను ప్రాంతములకు వచ్చెను.
Psalms 13
1. యెహోవా, ఎన్నాళ్లవరకు నన్ను మరచిపోవుదువు? నిత్యము మరచెదవా? నాకెంతకాలము విముఖుడవై యుందువు?
2. ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖా క్రాంతుడనై యుందును? ఎంతవరకు నాశత్రువు నామీద తన్ను హెచ్చించుకొనును?
3. యెహోవా నా దేవా, నామీద దృష్టియుంచి నాకుత్తరమిమ్ము
4. నేను మరణనిద్ర నొందకుండను వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండను నేను తూలిపోయి యుండగా నా విరోధులు హర్షింపకుండను నా కన్నులకు వెలుగిమ్ము.
5. నేనైతే నీ కృపయందు నమ్మిక యుంచి యున్నాను నీ రక్షణవిషయమై నా హృదయము హర్షించుచున్నది
6. యెహోవా నాకు మహోపకారములు చేసియున్నాడు నేను ఆయనను కీర్తించెదను.