3. సామ్రాజ్యంలో అహష్వేరోషు తర్వాత ప్రాముఖ్యంలో మొర్దెకైది ద్యితీయ స్థానం. యూదులందరిలో మొర్దెకైయే అతి ముఖ్యమైన వ్యక్తి. అతని తోటి యూదులు అతన్నెంతగానో గౌరవించేవారు. మొర్దెకై తన జాతీయ ప్రజల సంక్షేమ సౌభాగ్యాల కోసం విశేషంగా కృషిచేశాడు. మొర్దెకై యూదులందరికీ శాంతిని చేకూర్చాడు. అందుకే, సాటి యూదులందరికీ మొర్దెకై అంటే ఎంతో గౌరవం.