6. ఆ లేఖలో ఇలా పేర్కొనబడింది, “ఒక విషయం నాలుగు పక్కలా ప్రచారమవుతోంది. ఎక్కడ చూసినా జనం అదే చెప్పుకుంటున్నారు. మరి, అన్నట్టు, గెషెము అది నిజమే అంటున్నాడు. నువ్వూ, యూదులూ రాజుగారి మీద తిరగబడాలని కుట్రపన్నుతున్నట్లు జనం చెప్పుకుంటున్నారు. అందుకే నువ్వు యెరూషలేము ప్రాకారం నిర్మిస్తున్నావట. అంతేకాదు, నువ్వు యూదులకు కాబోయే రాజువని కూడా జనం చెప్పుకుంటున్నారు.